BJP: బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఒలింపిక్ పతక విజేత

  • బీజేపీలో పెరుగుతున్న క్రీడాకారుల సంఖ్య
  • హర్యానా బీజేపీ చీఫ్ భరాలా సమక్షంలో పార్టీలో చేరిన యోగేశ్వర్
  • మోదీ విధానాలతో ఆకర్షితుడ్నయ్యానని వెల్లడి

క్రీడారంగం నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న వారి సంఖ్య మరింత పెరిగింది. తాజాగా, ఒలింపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ బీజేపీలో చేరాడు. హర్యానాకు చెందిన యోగేశ్వర్ 2012 ఒలింపిక్స్ లో 60 కేజీల విభాగంలో కాంస్యం గెలిచాడు. ఆ మరుసటి ఏడాదే పద్మశ్రీ పురస్కారం వరించింది. 2014 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకం సాధించడంతో యోగేశ్వర్ పేరు మార్మోగింది.

తాజాగా, హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ భరాలా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధాంతాలు ఆకట్టుకున్నాయని, అందుకే బీజేపీలో చేరుతున్నట్టు యోగేశ్వర్ తెలిపాడు. మోదీ కారణంగా ప్రజాసేవ వైపు ఆకర్షితుడ్నయ్యానని, చాలాకాలంగా ఆయన్ను ఫాలో అవుతున్నానని వివరించాడు. కమలదళంలో భాగంగా కావడం పట్ల సంతోషంగా ఉందని అన్నాడు. కాగా, భారత హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ కూడా బీజేపీలో చేరాడు.

  • Loading...

More Telugu News