: ఆమోదముద్ర పొందిన క్యాన్సర్ మందు


ఎముకలకు వ్యాపించిన ప్రొస్టేట్ క్యాన్సర్ కణాలను నాశనం చేసే సొఫిగో మందుకు అమెరికా ఆహార, వైద్య శాఖ ఆమోద ముద్ర వేసింది. పురుషుల్లో టెస్టొస్టిరోన్ హార్మోన్ల స్థాయిని నియంత్రించే చికిత్స తీసుకున్న అనంతరం ఈ మందును వినియోగించాలని ఆ శాఖ సూచించింది. వ్యాధి సోకిన ఎముకల్లోకి వెళ్ళి అక్కడి క్యాన్సర్ కణాలను రేడియేషన్ తో సమూలంగా నిర్మూలించటంలో సొఫిగో విజయవంతం అయింది. 809 మంది పురుషులపై చేసిన పరిశోధనల్లో సొఫిగో పని తీరు అత్యంత ప్రభావవంతంగా ఉండడంతో మూడు నెలలకు ముందే ఈ మందుకు ఆమోద ముద్ర పడింది.

  • Loading...

More Telugu News