Venu Madhav: వేణుమాధవ్ నన్ను డాడీ అని పిలిచేవాడు: పరుచూరి గోపాలకృష్ణ

  • చిన్న వయసులోనే వేణు మరణించడాన్ని తట్టుకోలేకపోతున్నా
  • తమ సొంత వ్యక్తిని కోల్పోయినంతగా అందరూ బాధపడుతున్నారు
  • వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా

సినీ నటుడు వేణుమాధవ్ మరణం పట్ల సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేణు మృతి వల్ల సినీ రంగానికి మాత్రమే నష్టం జరిగినట్టు కాదని... రెండు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబం తమ సొంత వ్యక్తిని కోల్పోయినంతగా బాధపడుతోందని అన్నారు. 50 ఏళ్ల వయసులోనే వేణు మరణించడాన్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. '1996లో అందర్నీ అనుకరిస్తూ రవీంద్రభారతిలో మిమిక్రీ చేసేవాడు, అలాగే నన్ను కూడా చేశాడు' అని తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చాక తనను డాడీ అని పిలిచేవాడని అన్నారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

Venu Madhav
Tollywood
Paruchuri
  • Loading...

More Telugu News