Gabbar Singh: గబ్బర్ సింగ్ సమయంలో వెన్నుపూసలకు గాయాలయ్యాయి... మీడియా సమావేశానికి రాలేను: పవన్ కల్యాణ్

  • విజయవాడలో మీడియా రౌండ్ టేబుల్ మీటింగ్
  • సంపూర్ణ మద్దతు ఉంటుందన్న పవన్  
  • లేఖ విడుదల చేసిన జనసేనాని

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ఆరోగ్యం బాగాలేదంటూ ఓ లేఖ విడుదల చేశారు. మీడియా స్వేచ్ఛ కోసం విజయవాడలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి తాను రాలేకపోతున్నానని వెల్లడించారు. గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో వెన్నుపూసలకు తీవ్రగాయాలయ్యాని, ఇప్పటికీ ఆ నొప్పి వీడడంలేదని వివరించారు. ఎన్నికల సమయంలో ఆ నొప్పిని అలక్ష్యం చేయడంతో గాయాల తీవ్రత మరింత పెరిగిందని, డాక్టర్లు శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారని పవన్ తన లేఖలో తెలిపారు. అయితే సంప్రదాయ వైద్యవిధానాల పట్ల నమ్మకంతో సర్జరీ చేయించుకోదలచుకోలేదని వెల్లడించారు.

ప్రస్తుతం వెన్ను నొప్పి తిరగబెట్టడంతో మూడు రోజులుగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంలేదని, మీడియా మిత్రులు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా హాజరుకాలేనని వివరించారు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి నా తరఫున, జనసైనికుల తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుంది అంటూ లేఖలో పేర్కొన్నారు.

Gabbar Singh
Pawan Kalyan
Jana Sena
  • Loading...

More Telugu News