Anushka: దసరాకి అనుష్క 'నిశ్శబ్దం' టీజర్

  • 'భాగమతి'తో హిట్ కొట్టిన అనుష్క 
  • విభిన్నమైన కథాంశంతో 'నిశ్శబ్దం'
  • వివిధ భాషల్లో విడుదలకి సన్నాహాలు

'భాగమతి' తరువాత మంచికథ కోసం అనుష్క వెయిట్ చేయడంతో గ్యాప్ వచ్చింది. అయినా ఆమె తొందరపడకుండా తనకి కొత్తగా .. విభిన్నంగా అనిపించిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హేమంత్ మధుకర్ వినిపించిన కథకి ఓకే చెప్పిన ఆమె, చకచకా ఆ సినిమా షూటింగును పూర్తి చేసేసింది. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం దాదాపు విదేశాల్లోనే జరిగింది. ఈ సినిమాలో ఆమె మ్యూట్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది.

ఓ కీలకమైన పాత్రలో మాధవన్ నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హాలీవుడ్ నటుడు మైఖేల్ కనిపించనున్నాడు. దసరా పండుగకి ఈ సినిమా నుంచి టీజర్ ను వదలాలని ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తన కెరియర్లోని చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోతుందని అనుష్క భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

Anushka
Madhavan
  • Loading...

More Telugu News