venu madhav: గుర్తు పట్టలేని విధంగా నటుడు వేణుమాధవ్.. బయటకు వచ్చిన చివరి ఫొటో

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
  • షేర్ చేసిన నటుడు రాజశేఖర్
  • ఫొటో చూసి షాకవుతున్న అభిమానులు

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యంతో నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చిన్నవయసులోనే కన్నుమూయడంతో టాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది.

కాగా, వేణుమాధవ్‌తో వ్యక్తిగతంగా మంచి పరిచయం ఉన్న ‘మా’ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణుమాధవ్‌ను మంగళవారం కలిసి పరామర్శించారు. వేణుమాధవ్ మరణానంతం అతడితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన రాజశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఫొటోలో ఆసుపత్రి బెడ్‌పై ఉన్న వేణుమాధవ్ గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫొటోను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 

venu madhav
Tollywood
Rajsekhar
  • Loading...

More Telugu News