Jagan: బంజారాహిల్స్ లో ఉన్న మీ ఇంటిని క్రమబద్ధీకరించుకున్న సంగతి మర్చిపోయారా జగన్ గారూ?: బుద్ధా వెంకన్న

  • ఇడుపులపాయలో ఉన్న 618 ఎకరాల అసైన్డ్ భూమిని క్రమబద్ధీకరించుకున్నారు
  • వైసీపీలో చేరని వారి ఇల్లు అక్రమ కట్టడాలు అయిపోతాయా?
  • ప్రజలు అన్నీ గమనిస్తున్నారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ప్రజల గృహాలను కొల్లగొడతారా? అని మండిపడ్డారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో మీ భవనాన్ని క్రమబద్ధీకరించిన సంగతిని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ఇడుపులపాయలో మీకు ఉన్న 618 ఎకరాల అసైన్డ్ భూములును క్రమబద్ధీకరించుకున్న సంగతి గుర్తులేదా? అని అడిగారు. ఇప్పుడు వైసీపీలో చేరకుండా ఉన్న వారి ఇళ్లన్నీ అక్రమకట్టడాలు అయిపోతాయా? అని మండిపడ్డారు. ఇదేమైనా పులివెందుల పంచాయతీనా లేక పరిపాలనా? అని దుయ్యబట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని అన్నారు.

Jagan
YSRCP
Banjara Hills House
Idupulapaya
Budda Venkanna
Telugudesam
  • Loading...

More Telugu News