Telangana: సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు!

  • ‘కేసీఆర్ ‘ఓ పిచ్చికుక్క’ 
  • తులసి వనంలో గంజాయిమొక్కలా తయారయ్యాడు
  • ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ను నమ్మొద్దు

సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘కేసీఆర్ ఓ పిచ్చికుక్క’ అని, ‘తులసి వనంలో గంజాయిమొక్కలా తయారయ్యాడు’ అంటూ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ను ఎవరూ నమ్మొద్దని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపైనా ఆయన విమర్శలు చేశారు. బీజేపీని ఎలా నిరోధించాలన్న దానిపైనే వీరి సమావేశం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.

Telangana
cm
kcr
bjp
mp
soyam bapurao
  • Loading...

More Telugu News