Chittoor District: శివప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోజా

  • ఇటీవల మృతి చెందిన టీడీపీ నేత శివప్రసాద్ 
  • తిరుపతిలోని ఆయన నివాసానికి వెళ్లిన రోజా
  • శివప్రసాద్ కు నివాళులర్పించి..కుటుంబసభ్యులను ఓదార్చిన నేత

చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శివప్రసాద్ కుటుంబసభ్యులను ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ నేత రోజా పరామర్శించారు. తిరుపతిలోని శివప్రసాద్ నివాసానికి ఈరోజు ఆమె వెళ్లారు. ఆయన చిత్రపటం ముందు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ కుటుంబసభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. 'ప్రేమతపస్సు' చిత్రం ద్వారా రోజాను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది శివప్రసాదే అన్న విషయం విదితమే.

Chittoor District
Tirupati
N.Sivaprasad
mla
roja
  • Loading...

More Telugu News