Chandrababu: కన్నా నిద్రపోతున్నారా? జీవీఎల్ నోరు పడిపోయిందా?: సీపీఐ రామకృష్ణ

  • ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది
  • గతంలో చంద్రబాబు అడిగితే నిధులు ఇవ్వలేదు
  • ఇప్పుడు జగన్ అడిగే పరిస్థితి లేదు

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తోందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. రాజధాని నిధులపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రైల్వే జోన్ ను గాలికొదిలేశారని చెప్పారు. గతంలో చంద్రబాబు అడిగినా నిధులు ఇవ్వలేదని... ఇప్పుడు కేంద్రాన్ని జగన్ అడిగే పరిస్థితి కూడా లేదని అన్నారు. ఏపీలో మాట్లాడేవారు లేరనేది కేంద్రం ధీమా అని చెప్పారు. రాష్ట్ర సమస్యలపై బీజేపీ తెలుగు నేతలు ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ నిద్రపోతున్నారా? జీవీఎల్ నోరు పడిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు.

Chandrababu
Jagan
Kanna
GVL
Ramakrishna
CPI
Telugudesam
YSRCP
BJP
  • Loading...

More Telugu News