Rakul Preet Singh: ప్రభాస్, రానా, మహేశ్ బాబు, అల్లు అర్జున్ లకు రకుల్ ప్రీత్ సింగ్ ఛాలెంజ్!

  • రకుల్ కు మేక్ యువర్ మూవ్ ఛాలెంజ్ విసిన మలైకా అరోరా
  • యాంటీ గ్రావిటీ పుషప్స్ చేసిన రకుల్
  • మీ ఫిట్ నెస్ మూవ్స్ చూపించాలంటూ టాప్ హీరోలకు ఛాలెంజ్

సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ తెలిసిందే. జిమ్ లో తాను చేసిన వర్కౌట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... ఫిట్ నెస్ పట్ల అభిమానుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంటుంది.

తాజాగా... ఫిట్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా మేక్ యువర్ మూవ్ ఛాలెంజ్ ను స్వీకరించిన రకుల్... యాంటీ గ్రావిటీ పుషప్స్ చేసింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. బాలీవుడ్ నటి మలైకా అరోరా తనకు విసిరిన ఛాలెంజ్ ను తాను పూర్తి చేశానని... ఇదే ఛాలెంజ్ ను మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, అజయ్ దేవగణ్, రానా దగ్గుబాటి, మోహన్ శక్తిలకు విసురుతున్నానని తెలిపింది. వారి ఫిట్ నెట్ మూవ్స్ ను చూపించాలని ఛాలెంజ్ చేసింది.

Rakul Preet Singh
Make Your Moov Challenge
Prabhas
Mahesh Babu
Rana
Allu Arjun
Ajay Devgn
Bollywood
Hollywood
Malaika Arora
  • Loading...

More Telugu News