Yuvraj Singh: ధోనీ ఒక్కరోజులోనే గొప్ప వికెట్ కీపర్ కాలేదు, పంత్ ను అర్థం చేసుకోండి: యువరాజ్ సింగ్

  • పంత్ పేలవ ప్రదర్శన
  • కోచ్, చీఫ్ సెలెక్టర్ హెచ్చరించినట్టు వార్తలు
  • పంత్ ను ఒత్తిడికి గురిచేయొద్దన్న యువీ

వరుస వైఫల్యాలతో జట్టులో తన స్థానానికి ముప్పు తెచ్చుకుంటున్న రిషబ్ పంత్ కు యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ఎంఎస్ ధోనీ ఒక్కరోజులోనే గొప్ప వికెట్ కీపర్ కాలేదని, జట్టులో ధోనీ స్థానం సుస్థిరం కావడానికే చాలా సమయం పట్టిందని అన్నాడు. ఇప్పుడు పంత్ విషయంలోనూ అలాగే భావించాలని, టి20 ప్రపంచకప్ కు ఇంకా సమయం ఉన్నందున పంత్ పై ఒత్తిడి పెంచడం సరికాదని అన్నాడు.

 పేలవ ప్రదర్శన నేపథ్యంలో పంత్ ను కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ హెచ్చరించినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ, పంత్ నుంచి అత్యుత్తమ ఆటతీరు ఆశించేవాళ్లు ముందు అతడి ఆలోచన విధానాన్ని అవగాహన చేసుకోవాలని టీమిండియా మేనేజ్ మెంట్ కు హితవు పలికాడు.

Yuvraj Singh
MS Dhoni
Pant
India
Cricket
  • Loading...

More Telugu News