Yarlagadda Lakshmi Prasad: హిందీ రాకపోవడం వల్లే చంద్రబాబు ఢిల్లీలో నెగ్గలేకపోయారు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

  • అమరావతిలో మీడియా సమావేశం
  • హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదన్న యార్లగడ్డ
  • నిరసనల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్య

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష రాకపోవడం వల్లే చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పలేకపోయారని వ్యాఖ్యానించారు. హిందీ భాషకు వ్యతిరేకంగా తమిళనాడు, తదితర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు.

హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని పేర్కొన్న యార్లగడ్డ, హిందీ భాషను బలవంతంగా రుద్దడం కంటే తగిన విధంగా ప్రచారం చేసి ప్రజల్లో ఆసక్తి కలిగేలా చేయాలని అభిప్రాయపడ్డారు. అమరావతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ అందరూ నేర్చుకోవాలని వ్యాఖ్యలు చేయడంతో దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.

Yarlagadda Lakshmi Prasad
Andhra Pradesh
Hindi
  • Loading...

More Telugu News