Paruchuri: క్యారక్టర్ ఆర్టిస్ట్ జయలలిత పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పడింది: పరుచూరి గోపాలకృష్ణ

  • జయలలిత రహస్యంగా పెళ్లి చేసుకుంది 
  • కొంతకాలం పాటు సినిమాలకి దూరమైంది 
  • భర్త వలన ఎన్నో బాధలు పడిందన్న పరుచూరి

'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, క్యారక్టర్ ఆర్టిస్ట్ జయలలిత గురించి ప్రస్తావించారు. "ఒకసారి జయలలిత మా సినిమాకి పనిచేస్తూ, వేరే సినిమా షూటింగ్ వుంది .. త్వరగా పంపించండి అని అడిగి వెళ్లింది. ఆమె పెళ్లి చేసుకున్నట్టుగా మరుసటి రోజున ఓ దిన పత్రికలో చూసి ఆశ్చర్యపోయాము. ఆ తరువాత ఆమె ఎక్కడుందో .. ఏమైపోయిందో తెలియదు.

ఒకటిన్నర సంవత్సరం తరువాత మోహన్ బాబు సినిమా కోసం తిరుపతి వెళుతూ జయలలితను చూశాను. తనని భర్త చాలా కష్టాలు పెడుతున్నట్టుగా ఆ సమయంలోనే నాతో చెప్పుకుని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కొన్నిరోజులు గడిచాక తన భర్త తనని ఓ గదిలో బంధించి హింసిస్తున్నాడని వేరొకరితో నాకు జయలలిత కాల్ చేయించింది. నేను నాకు తెలిసినవాళ్లను అక్కడికి పంపించి ఆమె భర్తను హెచ్చరించాను. ఆ అమ్మాయిని విడిపించి తిరిగి పుట్టింటికి చేరుకునేలా చేశాను. ఈ విషయమంతా ఆమె అనుమతి తీసుకునే చెబుతున్నాను" అని ఆయన అన్నారు.

Paruchuri
Jayalalitha
  • Loading...

More Telugu News