Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సమాచారం పంపాం: గిరిజా శంకర్

  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం హాజరుకావాలి
  • సంబంధిత సర్టిఫికెట్స్ ను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి
  • వెరిఫికేషన్ సమయంలో వాటిని అధికారులకు అందజేయాలి

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం నిర్ణీత ప్రదేశంలో హాజరుకావాలని కోరుతూ మెస్సేజ్ లు, ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం పంపామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఆధారంగా కాల్ లెటర్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

ఇప్పటికే కాల్ లెటర్స్ అందుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారం, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, విద్యార్హతలు, క్యాస్ట్ సర్టిఫికెట్ ను సంబంధిత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. సదరు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఆయా సర్టిఫికెట్లను డౌన్ లోడ్ చేసుకుని, వెరిఫికేషన్ సమయంలో వాటిని అధికారులకు అందజేయాలని ఎంపికైన అభ్యర్థులకు సూచించారు.

Andhra Pradesh
Grama sachivalaya
call letters
  • Loading...

More Telugu News