East Godavari: బోటు నిర్వాహకుడు టీడీపీ మద్దతుదారుడు: మంత్రి అవంతి

  • టీడీపీ హయాంలోనే ఈ బోటుకు అనుమతి వచ్చింది
  • నాకు బోటు వ్యాపారాలు ఉన్నాయన్నది అబద్ధం
  • బోటు ప్రమాద ఘటనపై నివేదిక వచ్చాక చర్యలు  

తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాద ఘటనపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోటు నిర్వాహకుడు టీడీపీ మద్దతుదారుడు అని, టీడీపీ హయాంలోనే ఈ బోటు తిరిగేందుకు అనుమతి ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పుష్కరాల సమయంలో వశిష్ట బోటులోనే ప్రయాణించారని గుర్తుచేశారు. బోటు ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రభుత్వమే ఇస్తుందని స్పష్టం చేశారు. తనకు బోటు వ్యాపారాలు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

East Godavari
Boat accident
Minister
Avanthi
  • Loading...

More Telugu News