Jagan: ఆ సంస్థతో జగన్ చీకటి ఒప్పందం చేసుకున్నారు: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్

  • మేఘా సంస్థకు అర్హత లేదని గతంలో వైసీపీ నేతలు అన్నారు
  • ఇప్పుడు అదే సంస్థకు పనులు అప్పగించారు
  • ఇతర కాంట్రాక్టర్లు ముందుకు రాకుండా అడ్డుకున్నారు

మేఘా, మ్యాక్స్ ఇన్ఫ్రా కంపెనీలకు పోలవరం ప్రాజెక్టు చేపట్టే అర్హత లేదని... ఇలాంటి కంపెనీలకు కాంట్రాక్టులు ఎలా ఇస్తారని గతంలో వైసీపీ నేతలు విమర్శించారని టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఇప్పుడు అదే మేఘా కంపెనీకి కాంట్రాక్టు అప్పగించారని విమర్శించారు. మేఘా సంస్థతో జగన్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇతర కాంట్రాక్టర్లు ముందుకు రాకుండా బెదిరించారని అన్నారు. ఇరిగేషన్ మంత్రి అనిల్ వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

మరో నేత జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, ఏపీ ప్రాజెక్టులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో జగన్ పెడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో ప్రాజెక్టులను వదిలేసి, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలనుకోవడం దారుణమని అన్నారు. కేసీఆర్ డైరెక్షన్ లో పని చేస్తున్న జగన్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

Jagan
KCR
Polavaram
Megha
YSRCP
TRS
Telugudesam
Rajendra Prasad
  • Loading...

More Telugu News