Chandrababu: చంద్రబాబు నివాసాన్ని ఈ రోజే కూల్చేస్తున్నామన్న దుష్ప్రచారం తగదు: ఏపీ మంత్రి బొత్స

  • ఓ ఛానెల్ లో దుష్ప్రచారం చేశారు
  • అసత్య కథనాలు ఎందుకు ప్రసారం చేస్తున్నారు?
  • అక్రమనిర్మాణాలపై గతంలోనే నోటీసులు జారీ చేశాం

కృష్ణానది కరకట్టపై అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలవడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అక్రమనిర్మాణాలపై గతంలోనే నోటీసులు జారీ చేశామని, కోర్టు సూచనల మేరకే కూల్చివేత చర్యలు చేపట్టామని అన్నారు. రివర్ కన్జర్వేటివ్ యాక్టు ప్రకారం ఈ కట్టడాలకు అనుమతులు లేవు కనుక వీటిని తొలగించాలని ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుందని అన్నారు.

 ఏ ఇంట్లో అయితే చంద్రబాబు నివసిస్తున్నారో దాన్ని ల్యాండ్ పూలింగ్ లో గతంలో ప్రభుత్వానికి ఇచ్చారని బాబు, దాని యజమాని ఇంతకుముందే చెప్పారని, ఈరోజున అందుకు విరుద్ధంగా వాళ్లు మాట్లాడటం సబబు కాదని అన్నారు. పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని ఈరోజు కూల్చివేస్తుంటే, చంద్రబాబు నివాసాన్ని కూల్చివేస్తున్నారని ఓ ఛానెల్ లో దుష్ప్రచారం చేశారని, ఈ రకంగా అసత్య కథనాలు ఎందుకు ప్రసారం చేస్తున్నారో అర్థం కావట్లేదని మండిపడ్డారు.

Chandrababu
Undavalli
Minister
Botsa Satyanarayana
  • Loading...

More Telugu News