Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కూడా తెలియని ఓ విషయం చెబుతా వినండి: అల్లు అరవింద్

  • హైదరాబాద్ లో సైరా ప్రీరిలీజ్ వేడుక
  • హాజరైన సినీ ప్రముఖులు
  • సైరా చిత్రానికి తానే మొదటి ప్రేక్షకుడ్నని చెప్పిన అరవింద్

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సైరా ప్రీరిలీజ్ వేడుక సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వేదికపై మాట్లాడారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రాజమౌళి వంటి అతిరథులు వేదికపై ఉండగా, అరవింద్ మాట్లాడుతూ ఎవరికీ తెలియని ఓ విషయం చెబుతా వినాలని సభికులను కోరారు. ఆఖరికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కూడా ఆ విషయం తెలియదని, అదేంటంటే, సైరా సినిమా చూసిన మొదటి ప్రేక్షకుడ్ని తానేనని వెల్లడించారు. చిత్ర యూనిట్ సభ్యులు కాకుండా తానొక్కడ్నే సైరా మొత్తం వీక్షించానని తెలిపారు.

సినిమా చూసి కిందపడిపోయానని, వెంటనే చిరంజీవిని హత్తుకుని సంతోషం వ్యక్తం చేశానని వివరించారు. సైరా సూపర్ హిట్ అని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అయితే, చిరంజీవితో ఎన్నో సినిమాలు చేసిన తాను ఇలాంటి సినిమా చేయలేకపోయానని బాధపడుతున్నానని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. ఆ అవకాశం రామ్ చరణ్ కు దక్కిందని అన్నారు.

Pawan Kalyan
Allu Aravind
Syeraa
Chiranjeevi
Tollywood
  • Loading...

More Telugu News