Narendra Modi: యూఎస్ లో మోదీ కోసం స్పెషల్ మెనూ... వంటకాలివే!

  • నేటి నుంచి యూఎస్ లో వారం రోజుల మోదీ పర్యటన
  • ప్రత్యేకంగా వండి వడ్డించనున్న కిరణ్ వర్మ
  • పలు ప్రాంతాల వంటకాలతో మెనూ

ఏడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికాకు చేరుకోగా, హ్యూస్టన్ కు చెందిన ప్రముఖ భారతీయ చెఫ్‌ కిరణ్‌ వర్మ, ఆయనకు పసందైన వంటకాలను వండి, వడ్డించేందుకు సిద్ధమయ్యారు. మోదీ కోసం ప్రత్యేకంగా నోరూరించే వంటకాలు సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ స్వచ్ఛమైన భారత దేశీయ నెయ్యితో తయారవుతుండటం గమనార్హం. రెండు రకాల నమో తాలి, నమో తాలి మిఠాయి ఇందులో స్పెషల్.

ఇక మిఠాయిల్లో భాగంగా రస్‌ మలాయ్, గజర్‌ కా హల్వా, బాదం హల్వా, ష్రికండ్‌ (తీపి పెరుగు) ఉంటాయని తెలుస్తోంది. ఇక తాలీ విషయానికి వస్తే, కిచిడీ, కచోరీ, మేతి తెప్లా తదితర వంటకాలతో పాటు ఇండియాలోని పలు ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలను సిద్దం చేస్తున్నట్టు కిరణ్ వెల్లడించారు. భారత ప్రధాని కోసం వంటకాలు చేసే అవకాశం తనకు తొలిసారి లభించిందన్నారు. ఈ వంటకాలను ఐక్యరాజ్యసమితి 74వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లోనూ, మోదీ బసచేసే హోటల్‌ ల్ లోనూ వడ్డించనున్నారు.

Narendra Modi
Menu
USA
Tour
  • Loading...

More Telugu News