Narendra Modi: హ్యూస్టన్ లో కాలుపెట్టిన మోదీ... ఘన స్వాగతం!

  • నిన్న రాత్రి హ్యూస్టన్ కు చేరుకున్న మోదీ
  • స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు
  • నేడు 50 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ

వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలోని హ్యూస్టన్ లో కాలుమోపిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. భారత కాలమానం ప్రకారం, నిన్న రాత్రి 11 గంటల సమయంలో హ్యూస్టన్ లోని జార్జ్ బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మోదీ చేరుకోగా, ప్రొటోకాల్ అధికారులు, పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు, ప్రజలు వెల్ కమ్ చెప్పారు.

నేటి సాయంత్రం నగరంలోని భారీ మైదానంలో 'హౌడీ మోదీ' కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దాదాపు 50 వేల మంది హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మోదీ ప్రసంగాన్ని వినేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టు ప్రకటించారు. ఆయన కూడా సమావేశానికి రానున్నారు. కాగా, నేడు మోదీ, 18 చమురు కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో సమావేశం కానున్నారు.

Narendra Modi
Houston
Howdi Modi
USA
Donald Trump
  • Loading...

More Telugu News