Uttar Pradesh: మార్నింగ్ వాక్‌లో పలకరించిన అనుకోని అతిథి.. జనం బెంబేలు

  • రోడ్డుపైకి వచ్చిన మొసలి
  • ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఘటన
  • పట్టుకుని నదిలో వదిలిపెట్టిన అటవీ అధికారులు

ఉదయపు నడకకు వెళ్లిన జనం రోడ్డుపై కనిపించిన జీవిని చూసి విస్తుపోయారు. ఎదురుగా పెద్ద మొసలి తమవైపే చూస్తూ కనిపించడంతో భయంతో తలోదిక్కుకు పరుగులు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగిందీ ఘటన. ఇక్కడి నయాగంజ్ ప్రాంతంలో మార్నింగ్ వాక్‌కు బయలుదేరిన కొందరు రోడ్డుపై అడ్డంగా ఉన్న మొసలిని చూసి భయపడ్డారు.

వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, వారు అటవీశాఖ అధికారులను సంప్రదించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు దానిని ఒడిసి పట్టుకున్నారు. అనంతరం సమీపంలోని నదిలో దానిని వదిలిపెట్టారు. దీంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మొసలి రోడ్డుపైకి ఎలా వచ్చిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Uttar Pradesh
crocodile
shahjahanpur
  • Loading...

More Telugu News