Rajendra Prasad: శివప్రసాద్ దర్శకత్వంలో 'ప్రేమతపస్సు' చిత్రం చేశాను: రాజేంద్రప్రసాద్

  • టీడీపీ నేత శివప్రసాద్ మృతి
  • సంతాపం తెలిపిన రాజేంద్రప్రసాద్
  • శివప్రసాద్ ను ప్రియమిత్రుడిగా పేర్కొన్న నటదిగ్గజం

మంత్రిగానూ, ఎంపీగానూ రాజకీయ రంగంలో తనదైన ముద్రవేసిన టీడీపీ నేత శివప్రసాద్ మృతిపై సినీ నటుడు రాజేంద్రప్రసాద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శివప్రసాద్ తనకు ప్రియమిత్రుడని, ఆయన దర్శకత్వంలో 'ప్రేమతపస్సు' చిత్రం చేశానని వివరించారు. ప్రేమతపస్సు చిత్రం నుంచి అయ్యారే సినిమా వరకు తమ ఇద్దరి స్నేహం కొనసాగిందని తెలిపారు. కాగా, ప్రేమతపస్సు చిత్రం ద్వారానే రోజా హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ హీరో. ప్రేమతపస్సు చిత్రానికి మాత్రమే కాకుండా టోపీరాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరోకో సినిమాలకు కూడా శివప్రసాద్ దర్శకత్వం వహించారు.

Rajendra Prasad
Sivaprasad
Telugudesam
Tollywood
  • Loading...

More Telugu News