TRS: ఆంధ్ర ప్రాంతం వ్యక్తికి టికెట్ ఇచ్చారు: టీఆర్ఎస్ పై ఉత్తమ్ విమర్శలు

  • హుజూర్ నగర్ కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి
  • 30 వేల మెజార్టీతో కాంగ్రెస్ గెలవడం ఖాయం
  • రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారు

హుజూర్ నగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన వెంటనే... పార్టీల మధ్య విమర్శల పర్వం మొదలైంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హుజూర్ నగర్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

 ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్... ఈ ఆరేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించి కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు.

TRS
KCR
Uttam Kumar Reddy
Congress
Huzurnagar
Elections
  • Loading...

More Telugu News