Sivaprasad: మాజీ ఎంపీ శివప్రసాద్ మృతిపై నారా లోకేశ్ స్పందన

  • అనారోగ్యంతో కన్నుమూసిన శివప్రసాద్
  • ఆయన మృతి టీడీపీకి తీరని లోటు అని వ్యాఖ్యలు
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేశ్

టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూయడం పట్ల ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతికి చింతిస్తున్నానని ట్వీట్ చేశారు. శివప్రసాద్ మృతి టీడీపీకి తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. టీడీపీని బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారని, ఏపీకి ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్ వేదికగా తనదైన శైలిలో పోరాటం సాగించారని కొనియాడారు. రాజకీయనాయకుడిగానే కాకుండా సినీ కళాకారుడిగా కూడా ఆయన ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారని కీర్తించారు. ఈ విషాద సమయంలో శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Sivaprasad
Telugudesam
Nara Lokesh
Telugudesam
  • Loading...

More Telugu News