Huzurnagar: హుజూర్ నగర్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల

  • ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల
  • అక్టోబర్ 21న పోలింగ్
  • అక్టోబర్ 24న ఫలితాల వెల్లడి 

మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పాటు తెలంగాణ, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, గుజరాత్, అసోమ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, మేఘాలయ, ఒడిశా, పుదుచ్చేరి, సిక్కిం, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల ఉపఎన్నికలకు కూడా షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో హుజూర్ నగర్ కు కూడా ఉపఎన్నిక జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 28 చివరి తేదీ. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబర్ 21న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 24న ఫలితాలు విడుదల కానున్నాయి.

Huzurnagar
By Election
Telangana
  • Loading...

More Telugu News