new hair technic: బట్టతల వారికి శుభవార్త... వెంట్రుకలను మొలిపించే టోపీ వచ్చేసింది!

  • విస్కాన్‌సన్‌-మాడిసన్‌ శాస్త్రవేత్తల కొత్త టెక్నిక్‌
  • ఎటువంటి శస్త్ర చికిత్సలతో పనిలేదు
  • పైగా భలే చౌకగా టోపీ లభిస్తుందంటున్నారు

‘గాలికెగురు నీలి కురులు...పలుకుతున్నాయి మౌనరాగాలు’...అంటాడో భావుకుడు. ముఖారవిందానికి అదనపు సొబగులద్దేవి కురులే. స్త్రీపురుషులెవరైనా అందమైన జుత్తు కోసం ఆరాటపడతారు అందుకే, అటువంటి పరిస్థితుల్లో బట్టతల వేధిస్తుంటే వారి పరిస్థితి ఎలాఉంటుంది? హెయర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోవడమో, కనిపించిన నూనెలన్నీ వాడడమో చేస్తుంటారు.

వాటితో ఏ ప్రయోజనం లేదన్న విషయం అనుభవంలోకి వచ్చాక చెప్పలేనంత మనోవేదన అనుభవిస్తుంటారు. అయితే బట్టతల ఉందని బాధపడక్కర్లేదు, స్వల్పకాలంలో మీ తలపై వెంట్రుకలు మొలిపించే సరికొత్త టోపీని కనుక్కున్నామని చెబుతున్నారు అమెరికాకు చెందిన విస్కాన్‌సన్‌-మాడిసన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు.

తమ పరిశోధనల ద్వారా అత్యంత చౌకైన టోపీని కనుక్కున్నామని, ఈ టోపీ తలపై పెట్టుకున్నప్పుడు అందులోని విద్యుత్‌ పల్స్‌ బట్టతలపై ఉన్న చర్మకణాలను ఉత్తేజ పరుస్తాయని వీరు చెబుతున్నారు. దీనివల్ల తిరిగి జుట్టు పెరగడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయని పరిశోధనల్లో నిర్ధారించినట్లు తెలిపారు. ఎలుకలపై చేసిన ప్రయోగాలు ఫలితమిచ్చాయని, మనుషులపై కూడా సత్ఫలితాలు ఇస్తాయని పేర్కొన్నారు. ఇదే నిజమైతే బట్టతలతో బాధపడుతున్న వారికి శుభవార్తే కదా.

new hair technic
american university
HAT
Bald head
  • Loading...

More Telugu News