parigi: కారు ప్రమాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పులకు స్వల్ప గాయాలు

  • హైదరాబాద్ నుంచి పరిగి వెళ్తుండగా ఘటన
  • ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొన్న ఎమ్మెల్యే కారు
  • అపోలో ఆసుపత్రికి తరలింపు

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి పరిగి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మహేశ్వర్ రెడ్డి గాయపడ్డారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తొలుత ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

parigi
koppula maheshwar
chevella
TRS
  • Loading...

More Telugu News