Godavari: ఎడమ పక్క నుంచి వెళ్లాల్సిన బోటును గోదావరి మధ్యకి తీసుకెళ్లారు: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ

  • బోటు డ్రైవర్ కు అనుభవం లేదన్న ఎస్పీ
  • తనిఖీల సమయంలో అందరూ లైఫ్ జాకెట్లు ధరించారని వెల్లడి
  • ఘటనలో పోలీసుల తప్పిదంలేదన్న ఎస్పీ

గోదావరి అందాలను వీక్షించాలని భావించిన పర్యాటకులను జల సమాధి చేసిన రాయల్ వశిష్ఠ బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను పోలీసులు మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఎడమపక్క నుంచి వెళ్లాల్సిన బోటును గోదావరి మధ్యలోకి తీసుకెళ్లారని ఎస్పీ వివరించారు. ప్రమాద సమయంలో బోటు నడుపుతున్న వ్యక్తికి ఏమంత అనుభవంలేదని, అదే బోటు మునకకు దారితీసిందని వివరించారు.

బోటులో ఎనిమిది మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు, 64 మంది పెద్దవాళ్లు మొత్తం 75 మంది ఉన్నారని వెల్లడించారు. పోలీసుల సాధారణ తనిఖీల సమయంలో అందరూ లైఫ్ జాకెట్లు ధరించే కనిపించారని ఎస్పీ తెలిపారు. పోలీసుల తనిఖీల అనంతరం లైఫ్ జాకెట్లు తీసేయొచ్చని పర్యాటకులకు బోటు సిబ్బందే చెప్పారని, ఈ ఘటనలో పోలీసుల నుంచి ఎలాంటి తప్పిదంలేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News