Telangana: రేవంత్ రెడ్డి నాకు ముద్దుల అన్నయ్య.. నాపై అలా ఎందుకు మాట్లాడారో?: టీ-కాంగ్రెస్ నేత సంపత్ కుమార్

  • యురేనియం విషయంలో సంపత్ కు ఏం తెలియదన్న రేవంత్
  • రేవంత్ లా ఏది పడితే అది మాట్లాడను
  • ఈ వ్యాఖ్యలపై స్పందించిన సంపత్ కుమార్

టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఖండించారు. యురేనియం విషయంలో సంపత్ కు ఏబీసీడీలు కూడా తెలియవని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు రోజులుగా తాను ఢిల్లీలో ఉన్నానని, అందుకే, వెంటనే స్పందించలేకపోయానని చెప్పారు.

తాను పీహెచ్ డీ చేశానని, ఆ విషయం ప్రజలకు తెలుసని అన్నారు. రేవంత్ లా ఏది పడితే అది మాట్లాడనని, ఏ విషయంపైన అయినా పూర్తి సమాచారంతోనే మాట్లాడతానని చెప్పిన సంపత్, రేవంత్ తనకు ముద్దుల అన్నయ్య అని, ఆయన అలా ఎందుకు మాట్లాడారో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. యురేనియం తవ్వకాలపై ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీ చందర్, తనకు మాత్రమే ఆహ్వానం ఉందని, రేవంత్ కు లేదని చెప్పారు.

Telangana
congress
Revanth Reddy
Sampath kumar
  • Loading...

More Telugu News