Chandrababu: చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని గవర్నర్ దగ్గరకు వెళ్లారు?: మంత్రి బొత్స తీవ్ర వ్యాఖ్యలు

  • గవర్నర్ వ్యవస్థను చంద్రబాబు గతంలో విమర్శించారు
  • చంద్రబాబు తన హయాంలో సీబీఐపై నిషేధం విధించారు
  • మరి, కోడెల మృతిపై అదే సీబీఐతో విచారణ ఎలా కోరుతున్నారు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి వైసీపీ ప్రభుత్వమే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేయడాన్ని ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడెల ఆత్మహత్యను కూడా రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను గతంలో విమర్శించిన చంద్రబాబు, ఈరోజు ఏ మొహం పెట్టుకుని గవర్నర్ వద్దకు వెళ్లారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు తన హయాంలో సీబీఐపై నిషేధం విధించారని, మరి, కోడెల మృతిపై అదే సీబీఐతో విచారణ జరిపించాలని ఎలా కోరుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ వ్యవస్థా సరిగా లేదని, అన్ని వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశారని విమర్శించారు.

Chandrababu
Telugudesam
minister
botsa
  • Loading...

More Telugu News