Huzuru nagar: హుజూర్ నగర్ లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో మాకు తెలియదా?: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • రేవంత్ చెప్పే అభ్యర్థి పేరు నాకే తెలియదు!
  • జానారెడ్డి, ఉత్తమ్, నేను ఒక్కటయ్యాం 
  • మమ్మల్ని కాదని కొత్త అభ్యర్థిని పెడతారా?

హుజూర్ నగర్ లో త్వరలో జరగనున్న ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పద్మావతి పేరును టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ, 'హుజూర్ నగర్ లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో మాకు తెలియదా?' అని ప్రశ్నించారు. రేవంత్ చెప్పే అభ్యర్థి పేరు తనకే తెలియదని అన్నారు. జానారెడ్డి, ఉత్తమ్, తాను ఒక్కటయ్యామని, ‘మమ్మల్ని కాదని కొత్త అభ్యర్థిని పెడతారా?’ అని ప్రశ్నించారు. రాజకీయాలపై తాను, తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుకోమని అన్నారు.

Huzuru nagar
congress
By-elections
Komati reddy
  • Loading...

More Telugu News