Chittoor District: సినీ నటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్‌కు మళ్లీ తీవ్ర అస్వస్థత

  • కొన్ని రోజులుగా అనారోగ్యంతో సతమతం
  • ఇటీవలే అస్వస్థతతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరిక
  • ఈరోజు మళ్లీ అపోలో ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు

చిత్తూరు మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌ మళ్లీ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకున్న అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఆయనకు కిడ్నీ సంబంధిత వ్యాధి మళ్లీ తిరగదోడడంతో ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  చిత్తూరు లోక్ సభ స్థానం నుంచి శివప్రసాద్ రెండుసార్లు టీడీపీ తరపున గెలుపొందారు.

Chittoor District
ex.MP sivaprasad
chenai
hospitalaised
  • Loading...

More Telugu News