Andhra Pradesh: రేపు గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు

  • కోడెల ఆత్మహత్య ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ
  • ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని కోరనున్న బాబు
  • రేపు ఉదయం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ

రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు కలవనున్నారు. కోడెల ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశించాలని కోరనున్నారు. తమ నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. కాగా, రేపు ఉదయం తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్టు సమాచారం. సమావేశం తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Andhra Pradesh
Governer
Chandrababu
Kodela
  • Loading...

More Telugu News