E-cigarettes: ఈ-సిగరెట్లపై నిషేధం విధించిన మోదీ సర్కారు!
- ఆమోదించిన కేంద్ర కేబినెట్
- ఈ-సిగరెట్ల తయారీ, అమ్మకం, నిల్వపై నిషేధం
- వివరాలు ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మల
పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిరుత్సాహపరిచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఈ-సిగరెట్ల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘దేశంలో ఈ-సిగరెట్లపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిప్రకారం ఈ-సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుమతి-ఎగుమతి, రవాణా, అమ్మకం, నిల్వ చేయడం, ప్రకటనలు ఇవ్వడాన్ని నిషేధిస్తున్నాం’ అని సీతారామన్ చెప్పారు.