East Godavari District: బోటు ప్రమాదంలో అమరేశ్వర ఆలయ ఈవో మృతి చెందినట్టు నిర్ధారణ!

  • నరసాపురం అమరేశ్వర ఆలయంలో గ్రేడ్-2 ఈవో రఘురాం
  • రఘురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
  • కారుణ్య నియామకం కింద భార్యకి ఉద్యోగం ఇస్తాం: మంత్రి వెల్లంపల్లి

తూర్పు గోదావరి జిల్లాల్లో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో నరసాపురం అమరేశ్వర ఆలయ ఈవో మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అమరేశ్వర ఆలయంలో గ్రేడ్-2 ఈవో అయిన రఘురాం, పాపికొండల విహారయాత్రకు వెళ్లి, బోటు ప్రమాదంలో మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. రఘురాం కుటుంబసభ్యులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సానుభూతి తెలిపారు. రఘురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కారుణ్య నియామకం కింద ఆయన భార్య నాగజ్యోతికి ఉద్యోగావకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

East Godavari District
Boat Accident
EO
Raghuram
  • Loading...

More Telugu News