Kodela siva prasad: కోడెల మృతిపై సమగ్ర విచారణ జరిపితే చంద్రబాబు ముద్దాయి అని తేలుతుంది: కొడాలి నాని

  • కోడెల మృతి ఘటన తెలంగాణలో జరిగింది
  • మా ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు
  • బాబు కోరినట్టే సీబీఐ ఎంక్వయిరీ వేయాలని మేమూ అడుగుతున్నాం

కోడెల శివప్రసాద్ మృతిపై సమగ్ర విచారణ జరిపితే చంద్రబాబునాయుడు ముద్దాయి అని తేలుతుందని మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. కోడెల మృతి ఘటనపై విచారణకు కమిటీ వేస్తారా? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది కనుక, తమ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని చెప్పారు. ఈ ఘటనపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని చంద్రబాబు అడుగుతున్నారని, తాము కూడా అదే అడుగుతున్నామని అన్నారు. పక్కింటోళ్లో, ఎదురు పార్టీ వాళ్లో ఏదో అన్నారని ఎవరూ ఆత్మహత్య చేసుకోరని, మన ఇంట్లో వాళ్లో, భార్యో, పిల్లలో లేకపోతే మనల్ని నమ్ముకున్న నాయకుడో మనల్ని దూరంగా పెట్టినప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉంటాయని వ్యాఖ్యానించారు.

Kodela siva prasad
Kodali Nani
Chandrababu
  • Loading...

More Telugu News