St Francis College: సెయింట్ ఫ్రాన్సిస్ అమ్మాయిలకు కేటీఆర్ శుభాభినందనలు... టీఆర్ఎస్ కు జై కొట్టిన రామ్ గోపాల్ వర్మ

  • సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో అమ్మాయిలకు డ్రెస్ కోడ్
  • ఉద్యమించిన విద్యార్థినులు
  • డ్రెస్ కోడ్ ఎత్తివేసిన కాలేజీ యాజమాన్యం

హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో అమ్మాయిలకు ఇటీవల డ్రెస్ కోడ్ విధించడం జరిగింది. దాంతో నిరసనలు చేపట్టిన విద్యార్థినులు తమ పంతం నెగ్గించుకున్నారు. డ్రెస్ కోడ్ ను ఉపసంహరించుకుంటున్నట్టు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిసూ, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ అమ్మాయిలకు శుభాభినందనలు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. "వావ్, ప్రగతిశీల ప్రభుత్వం అంటే ఇదే. జై టీఆర్ఎస్ "అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

St Francis College
Hyderabad
KTR
RGV
  • Error fetching data: Network response was not ok

More Telugu News