East Godavari District: గోదావరి బోటు ప్రమాదం.. మరో మృతదేహం లభ్యం

  • కాఫర్ డ్యామ్ వద్ద మరో మృతదేహం గుర్తింపు 
  • తీసుకొచ్చేందుకు బయలుదేరిన సిబ్బంది
  • ప్రారంభమైన సహాయక చర్యలు

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో జరిగిన బోటు ప్రమాద ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. కాఫర్ డ్యామ్ వద్ద మరో మృతదేహం కనిపించడంతో తీసుకొచ్చేందుకు సహాయక సిబ్బంది బయలుదేరారు. కాగా, ఇంకా మరో 36 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు సహాయక చర్యలు కొనసాగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు వచ్చిన నేవీ హెలికాప్టర్ వెనుదిరిగింది. అయితే, బోటు మాత్రం 300 అడుగుల లోతున ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అందులో కొందరు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్న అధికారులు.. నేడు దానిని ఎలాగైనా బయటకు తీయాలని యోచిస్తున్నారు.

East Godavari District
godavari river
Boat accident
  • Loading...

More Telugu News