Norway: వామ్మో!... ఇదేం చేప!
- నార్వేలో సముద్ర జలాల్లో వింత చేప
- పెద్ద కన్ను, చిన్న శరీరంతో ఆశ్చర్యకరమైన రూపు
- సోషల్ మీడియాలో వైరల్
ఈ విశాల ప్రపంచం కోట్లాది రకాల ప్రాణులకు ఆవాసం. సముద్రాల్లో లెక్కకుమిక్కిలి జీవజాతులు ఉన్నాయని తెలిసిందే. తాజాగా ఓ టీనేజ్ యువకుడు సముద్రంలో గాలం వేస్తే విచిత్రమైన జీవి తగులుకుంది. పెద్దకంటితో ఉన్న ఆ రాక్షస చేప ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నార్వే దేశానికి చెందిన ఆస్కార్ లుండాల్ అనే 19 ఏళ్ల ఫిషింగ్ గైడ్ చేపలవేటకు వెళ్లగా, అనూహ్యరీతిలో వింత చేప దొరికింది. బల్బు ఆకారంలో ఉన్న పెద్ద కన్ను, చిన్న శరీరంతో ఉండడంతో లుండాల్ భయపడిపోయాడు. ఇలాంటి చేప చాలా అరుదుగా లభ్యమవుతుందని వ్యాఖ్యానించాడు.
ఇది సొరచేపల జాతికి చెందిన రాకాసి చేప అని వెల్లడించాడు. దీని శాస్త్రీయ నామం చిమేరస్ మాన్ స్ట్రోసా లిన్నేయస్. గ్రీకు పురాణాల్లో సింహం తల, డ్రాగన్ తోక ఉండే జీవిని పోలి ఉండడంతో దీనికా పేరు వచ్చింది.