Karti Chidambaram: మీరు లేకుండా మేము ఈ వేడుకలను జరుపుకోలేము.... 'పుట్టిన రోజు'న చిదంబరానికి తనయుడి మెసేజ్!

  • నేడు చిదంబరం 74వ పుట్టిన రోజు
  • తీహార్ జైల్లో ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి
  • ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన కార్తి

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, కేంద్రంలో ఆర్థిక, హోమ్ శాఖలను నిర్వహించిన వ్యక్తి. అయితేనేం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, ప్రస్తుతం న్యూఢిల్లీలోని తీహార్ జైల్లో కాలం గడుపుతున్నారు. ఆయనే పి.చిదంబరం. నేడు ఆయన 74వ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యుల మధ్య, పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుయాయుల మధ్య వేడుకలు జరుపుకునే ఆయన, ఈ సంవత్సరం జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం, తండ్రికి ఓ మెసేజ్ పంపాడు. "56 అనే సంఖ్య ఆపలేదు" అని పేర్కొన్నారు. "మీ వయసు 74 సంవత్సరాలు. '56' మిమ్మల్ని ఆపలేదు. మీరు ఎన్నడూ పుట్టినరోజును గ్రాండ్ గా చేసుకోలేదు. మీరు లేకుండా మేము ఈ వేడుకలను జరుపుకోలేము. మీరు సాధ్యమైనంత త్వరగా వచ్చి మా కోసం కేక్ ను కట్ చేయాలని కోరుకుంటున్నాం" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ సుదీర్ఘ లేఖను ఆయన రాశారు. మీరు చూపించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు.

ఇక ఇదే లేఖలో చంద్రయాన్-2 గురించి కూడా కార్తి చిదంబరం ప్రస్తావించారు. ఈ కార్యక్రమాన్ని తాను లైవ్ చూశానని చెబుతూ, అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని, ముఖ్యంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ఏడుస్తున్నట్టు కనిపించారని, ఆపై ప్రధాని మోదీ, ఆయన్ను ఓదార్చారని గుర్తు చేసుకున్నారు. మోదీకి ఆయన భక్తులపైనే ప్రేమని ఎద్దేవా చేస్తూ, ఏవియేషన్ సాంకేతికతను, ప్లాస్టిక్ సర్జరీని భారత శాస్త్రవేత్తలు, వైద్యలు ఎన్నో సంవత్సరాల క్రితమే కనుగొన్నారని, ఇస్రో కాదని అన్నారు. పీయుష్ గోయల్, నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన వాహన అమ్మకాలపై వ్యాఖ్యలను, జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులను కూడా కార్తి తన లేఖలో పేర్కొనడం గమనార్హం.

Karti Chidambaram
Chidambaram
Birthday
Tihar Jail
  • Error fetching data: Network response was not ok

More Telugu News