East Godavari District: బోటు ప్రమాదం: ఉక్కపోతే కొంప ముంచింది!

  • ఉక్కపోత కారణంగా ధరించిన లైఫ్ జాకెట్లను తీసేసిన పర్యాటకులు
  • లైఫ్ జాకెట్లు ధరించిన వారిలో 14 మంది సురక్షితం
  • ప్రమాదం తర్వాత తలో దిక్కుకు కొట్టుకుపోయిన వైనం

గోదావరి నదిలో నిన్న జరిగిన బోటు దుర్ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోవడానికి, గల్లంతవడానికి కారణం ఉక్కపోతేనని ప్రమాదం నుంచి బతికి బయటపడిన వరంగల్ జిల్లా వాసి ప్రభాకర్ తెలిపారు. ఉక్కపోతకు భరించలేక అప్పటి వరకు ధరించిన లైఫ్ జాకెట్లను చాలామంది తీసేశారని ఆయన తెలిపారు. ఫలితంగా బోటు మునిగిన తర్వాత చాలామంది తలో దిక్కుకు కొట్టుకుపోయారని అన్నారు. కొందరైతే కాఫర్ డ్యామ్ వరకు వెళ్లిపోయారని తెలిపారు. ఉక్కపోత లేకపోతే వారంతా లైఫ్ జాకెట్లు తీసేవారు కాదని, ఫలితంగా వారంతా ప్రాణాలతో బయటపడేవారని పేర్కొన్నారు. లైఫ్ జాకెట్లు ధరించిన వారిలో 14 మంది బతికి బయటపడ్డారని ప్రభాకర్ తెలిపారు.

East Godavari District
godavar river
boat accident
life jacket
  • Loading...

More Telugu News