: నిప్పుల కొలిమిలా మండుతున్న రాష్ట్రం


రాష్ట్రం అగ్నిగుండంలా మండిపోతుంది. రెండు రోజుల క్రితం మహాసేన్ తుపాను కారణంగా కాస్త తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ యథావిధిగా పెరిగిపోయాయి. దీంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా కాలిపోతోంది. పగలు కాలు బయట పెట్టాలంటే గుండె చిక్కబట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ఇంకా ప్రవేశించకపోవడంతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీలు నమోదు కాగా, విశాఖపట్టణంలో అత్యల్పంగా 34 డిగ్రీలు నమోదయ్యాయి. గుంటూరులో, నల్గొండ, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో 43 డిగ్రీలు నమోదుకాగా ఒంగోలు, మహబూబ్ నగర్, తిరుపతి, ఒంగోలు, అదిలాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీలు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News