Devopatnam: గోదావరిలో లాంచీ మునక..నేవీ సాయం కోరాం: మంత్రి సుచరిత

  • ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతాం
  • సహాయక చర్యలకు ఆదేశించాం
  • ఓఎన్జీసీ నుంచి చాపర్లు పంపమని అడిగాం

గోదావరిలో లాంచీ మునక ఘటనపై ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత స్పందించారు. ఈ ప్రమాద ఘటన సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలకు ఆదేశించామని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి వెళ్లాయి, అలాగే, నేవీ సాయం కోరామని, ఓఎన్జీసీ నుంచి చాపర్లు పంపమని అడిగామని చెప్పారు.

గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉందని బోటులో 61 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోందని, వారి వద్ద లైఫ్ జాకెట్లు ఉన్నట్టు చెబుతున్నారని అన్నారు. లాంచీ కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నట్టు తేలితే చర్యలు చేపడతామని అన్నారు. లాంచీకి ఎవరు అనుమతించారన్న పూర్తి వివరాలు తీసుకుంటామని, వారిపై చర్యలు తప్పవని అన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగుకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Devopatnam
minister
sucharita
Navy
Ongc
  • Loading...

More Telugu News