Prabhas: సినిమా బాగుంటే అవన్నీ పక్కన పెట్టేస్తారు: ప్రభాస్

  • ఆగస్టు 30న సాహో రిలీజ్
  • సాహో రిలీజ్ తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రభాస్
  • జాతీయస్థాయి సినిమాకు బాహుబలి అవకాశం కల్పించిందన్న ప్రభాస్

సాహో చిత్రం రిలీజ్ తర్వాత హీరో ప్రభాస్ మీడియాతో మాట్లాడారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ,  ఓ భాషలో ఇతర భాషల సినిమాలను ఆదరించకపోవడం అన్నిచోట్లా ఉందని అభిప్రాయపడ్డారు. తమ భాషలో ఉన్న నటులను గుర్తించినంతగా ఇతర భాషల నటులను స్థానికులు త్వరగా గుర్తించరని తెలిపారు. కానీ సినిమా బాగుంటే మాత్రం అవన్నీ పక్కన పెట్టేస్తారని, నటీనటుల సంగతి వదిలేసి సినిమాకు బ్రహ్మరథం పడతారని ప్రభాస్ వివరించారు.

ఇలాంటి హద్దులను చెరిపివేసిన చిత్రం బాహుబలి అని పేర్కొన్న ప్రభాస్, జాతీయ స్థాయి సినిమాలకు బాహుబలి ద్వారాలు తెరిచిందని తెలిపారు. కాగా, ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన సాహో చిత్రం ఆగస్టు 30న రిలీజైంది. రెండు వారాలు ముగిసేసరికి ఈ చిత్రం రూ.424 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Prabhas
Saaho
Tollywood
  • Loading...

More Telugu News