Jagan: ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రమాణం... అభినందించిన జగన్!

  • ఇటీవల నియమితులైన లక్ష్మణ్ రెడ్డి
  • ప్రమాణం చేయించిన గవర్నర్
  • తేనీటి విందు ఇచ్చిన జగన్

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా జస్టిస్‌ పీ లక్ష్మణ్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, లక్ష్మణ్ రెడ్డితో ప్రమాణం చేయించారు. ఐదు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, లక్ష్మణ్ రెడ్డిని అభినందించారు. గవర్నర్, కొత్త లోకాయాక్తకు తేనీటి విందు ఇచ్చారు. కాగా, లోకాయుక్త నియామకంతో పెండింగ్‌ కేసుల పరిష్కారం వేగవంతం కానుందని ఇటీవల జరన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Jagan
Lokayukta
Justice Laxman Reddy
Governer
  • Loading...

More Telugu News