Satya Nadella: స్పెషల్ ఫ్లయిట్ లో హైదరాబాద్ కు చేరుకున్న సత్య నాదెళ్ల!

  • శుక్రవారం నాడు మరణించిన యుగంధర్
  • నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • అధికార లాంఛనాలతో జరిపించాలని ప్రభుత్వ ఆదేశం

తన తండ్రి, విశ్రాంత ఐఏఎస్ అధికారి యుగంధర్ మరణ వార్తను తెలుసుకున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ కు చేరుకున్నారు. 82 ఏళ్ల యుగంధర్ శుక్రవారం నాడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు నేడు హైదరాబాద్‌ లోని మహా ప్రస్థానంలో జరుగనున్నాయి.

అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నల్లగండ్లలోని సిటిజన్‌ ఆసుపత్రిలో ఆయన భౌతికకాయం ఉండగా, మరికాసేపట్లో భౌతికకాయాన్ని హైదరాబాద్ కు తరలించనున్నారు. సాయంత్రంలోగా అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.

Satya Nadella
Microsoft
CEO
Yudandhar
Last Riots
  • Loading...

More Telugu News