New Delhi Bacteria: 2011లో తొలిసారి... ఇప్పుడు గుంటూరులో కనిపించిన 'న్యూఢిల్లీ బ్యాక్టీరియా'!

  • పలు సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ప్రమీల
  • వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు
  • ప్రమాదకరమైన బ్యాక్టీరియా సోకిందని నిర్ధారణ

దాదాపు 18 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కనిపించిన అత్యంత ప్రమాదకరమైన న్యూఢిల్లీ మెటల్లో బీటా ల్యాక్టమేజ్‌ (ఎన్‌డీఎం-1) బ్యాక్టీరియా, ఇప్పుడు మరోసారి గుంటూరులో కనిపించింది. 2011లో తెలంగాణ ప్రాంతంలో న్యూఢిల్లీ బ్యాక్టీరియాకు సంబంధించిన తొలి కేసు నమోదుకాగా, ఇప్పుడు గుంటూరుకు చెందిన పూర్ణ ప్రమీల (55) అనే మహిళకు ఈ బ్యాక్టీరియా సోకిందని  వైద్య నిపుణుడు డాక్టర్‌ కోగంటి కల్యాణ్‌ చక్రవర్తి వెల్లడించారు.

జ్వరం, నీరసం, కామెర్లు, మూత్ర సమస్యలతో ఈ నెల 3వ తేదీన అరండల్‌ పేటలోని శ్రీ హాస్పిటల్‌ లో ప్రమీల చేరగా, ఆమెకు రక్త పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, ఇది న్యూఢిల్లీ బ్యాక్టీరియాగా తేల్చారు. ఇది ప్రమాదకరమైనదని, ఆమెకు చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు.

New Delhi Bacteria
Guntur
Andhra Pradesh
Virus
  • Loading...

More Telugu News