bigg boss: బిగ్ బాస్-3... నేడు ఎలిమినేట్ కానున్న శిల్పా చక్రవర్తి!

  • హిమజ సేవ్ అయినట్టు ప్రకటించిన బిగ్ బాస్
  • శిల్ప బయటకు వెళ్లినట్టు ప్రచారం
  • నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్

టాలీవుడ్ లో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ మూడవ సీజన్ లో భాగంగా ఈ వారం యాంకర్, నటి శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ కానున్నట్టు సమాచారం. మూడు వారాల క్రితమే శిల్ప హౌస్ లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారంలో శిల్పతో పాటు శ్రీముఖి, హిమజ, మహేశ్ విట్టా, పునర్నవి ఉండగా, హిమజ సేవ్ అయినట్టు బిగ్ బాస్ ఇప్పటికే ప్రకటించాడు. ఇక ఎలిమినేషన్ ఎపిసోడ్ ను ఇప్పటికే చిత్రీకరించగా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకాశం శిల్ప ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం అధికారికంగా తెలియాలంటే ఈ రోజు రాత్రి వరకూ ఆగి, షో చూడాల్సిందే.

bigg boss
Himaja
Silpa
Elimination
  • Loading...

More Telugu News