saudi arabia: సౌదీ చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారుల డ్రోన్ దాడులు

  • ఆరాంకో చమురు క్షేత్రాల్లో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు
  • తెలియరాని నష్టం వివరాలు
  • దాడులకు అవసరమైన ఆయుధాలు అందిస్తున్న ఇరాన్

సౌదీ అరేబియాపై యెమన్ తిరుగుబాటుదారులు మరోమారు విరుచుకుపడ్డారు. అబ్‌కైక్, ఖురైస్‌లో ప్రభుత్వ కంపెనీ అయిన ఆరాంకోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై డ్రోన్లతో దాడులు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇరాన్-సౌదీ మధ్య నెలకొన్న విభేదాలే ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది.

హుతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తోంది. ఈ దాడికి అవసరమైన మానవ రహిత డ్రోన్లను సరఫరా చేసింది కూడా ఇరానేనని భావిస్తున్నారు. ఇరాన్ సహకారం, అది అందిస్తున్న అధునాతన ఆయుధాలతో తిరుగుబాటుదారులు యెమన్ రాజధాని సనాతోపాటు పేద అరబ్ దేశాల్లోని మరికొన్ని ప్రాంతాలను హస్తగతం చేసుకున్నారు. కాగా, తాజా ఘటనలో ఎంత నష్టం వాటిల్లిందన్నది తెలియరాలేదు.

saudi arabia
iran
drone strikes
oil refinery
  • Loading...

More Telugu News